ఈరోజు ఆయుద పూజ శుభాకాంక్షలు.
హనుమాన్ ఆయుధం ‘గధ’
స్వామి వారి గధ పేరు ‘ఠంకా’
గత 30/ సం లుగా నేను
ఠంకా ఆయుధ పూజ చేస్తున్నాను. 🙏. ఈ గధ ను నాకు తిరుమలలోని, అంజనాద్రి లోగల జాబాలి ఆంజనేయ క్షేత్రంలో స్వామి సన్నిధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్వామి వారి గధను నాకు అక్కడి పూజారి బహూకరించారు. 45 నిముషాలు ధ్యానంలో ఉన్న నన్ను, నా పిల్లలు ఏడుస్తుంటే, వాళ్ళకొరకు నన్ను బాహ్యం లోనికి తీసుకొని రావడానికి, ఆ గధా స్పర్శ నాకు కలుగజేసి, నాకు ఆ పవిత్ర గధను బహూకరించారు. అది 1990. అప్పటి నుండి ఈగదాయుధ పూజ చేస్తున్నాను 🙏. ఈ గధ ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు స్వామి వారు. త్వరలో మీతో పంచుకుంటాను. వెబ్ సైట్ లో పదిలపరుస్తున్నాను భావితరాలకొరకు 🙏. వానప్రస్థం కాబట్టి తెలియపరుస్తాను. అవన్నీ తెలిసికొని జనాలు నా ప్రశాంతతకు భంగం కలుగజేస్తారని భావించి, భయటపెట్టలేదు. స్వస్తి 🙏🙏🙏
ఆంజనేయ స్వామి వారిని నమ్మండి. భగవద్గీతను అనుసరించండి.
రామ రామ శ్రీ రామ 🙏🙏🙏
అనేక హనుమత్ స్మరణలతో మీ హనుమాన్ మాతాజీ 🙏🙏🙏

By | October 24, 2020