62nd Hanuman Chalisa Prathishta, Vanagaram, Chennai – 15-10-2016
[nggallery id=363]
62 వ ప్రతిష్ట చెన్నై వానగరం లోని 1500 సంవత్సరాలనాటి మనవాళ్ళ పెరుమాళ్ ఆలయం లో పోరాటాసి శనివారం మరియు పౌర్ణమి కలిసి రావడం వలన వైభవం గా జరిగినది. మాతాజీ భక్తుల చేత హనుమాన్ చాలీసా పారాయణ సామూహికంగా జరిపించారు. గోవింద నామ స్మరణ, రామ భజన చేసారు. సిందూరం, రక్షలు, చాలీసా పేపర్స్ పంచిపెట్టినారు. ఆలయ ధర్మకర్తలు, పూజారి, ఈ ఓ గారు ఆలయ మర్యాదలతో మాతాజీని, సంజీవిని పీఠం సభ్యులను తగిన రీతిన సత్కరించారు. మాతాజీ మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో , ప్రతి ఒక్కరు నిశ్చింతగా, నిత్యానందంగా ఉండాలంటే అవశ్యం మీరు హనుమాన్ చాలీసా పారాయణ సామూహికంగా చేయాలనీ సూచించారు. నవంబర్ 11 న జరుగబోవు తులసి దామోదర కల్యాణానికి అందరూ రావాలని భక్తులను ఆహ్వానించారు. హనుమాన్ చాలీసా కలియుగ మానవాళికి దివ్య ఔషధం లాంటిదని, ఆశ్రయిస్తే జీవితం ఆనంద మయం అవుతుందని, పిలిస్తే పలికే దైవం ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తారని మాతాజీ భక్తులకు భరోసా ఇచ్చారు. అనంతరం ప్రసాద వినియోగం జరిగినది.