Kanchipuram

పూర్వకాలంలో కాశీ పండితుల వలే కంచి పండితులకు కూడా ప్రాముఖ్యత ఉండేది.. ఆ రోజులలో ఏదైనా ఒక రచన గాని, కథ కానీ వ్రాస్తే అది సమాజానికి ఉపయోగకరమైనదా కాదా అనే విషయాన్నీ నిర్ధారించుటకు కంచి పండితులకు ఆ రచన నను పంపి వారు అంగీకరిస్తేనే దానిని సమాజానికి అందించేవారు, అందుకనే కథ కంచికి అనే నానుడి వచ్చినది అంటారు.

1000 కి పైగా దేవాలయములు వున్నాయి కాబట్టే కాంచీపురాన్ని “The City of Thousand Temples” అని అంటారు. ఐతే ముఖ్యమైన ఆలయాలు గురించి చెప్పమంటే మాత్రం, ముందు అన్ని ముఖ్యమైనవే అని చెప్పాలి కానీ అందునా తప్పనిసరిగా చూడవలసినవి మాత్రం సుమారు 20 వరకు ఉంటాయి. అసలు కంచి యాత్ర ప్రతి ఒక్కరు జీవితకాలం లో తప్పనిసరిగా చేయవలసినది. మనం కేవలం చక్కటి ప్రణాళిక తో ఒక్క 2 రోజులలో కంచి లోని అన్ని ప్రముఖ ఆలయాలు దర్శించవచ్చు. శ్రీవైష్ణవ సంప్రదాయం లో అతి ముఖ్యమైన 108 దివ్యదేశాలలో సుమారు 15 వరకు ఒక్క కంచి లోనే ఉన్నాయి. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే కంచి లోని అన్ని ఆలయాలు ఉదయం 6.00-12am వరకు తిరిగి సాయంత్రం 4-8pm వరకు మాత్రమే తెరచిఉంటాయి.

ఈ క్రింద పేర్కొనబడిన విధంగా అన్ని ఆలయాలు తక్కువ సమయం లో దర్శించవచ్చు, రూట్ మ్యాప్ కూడా ఇవ్వబడినది.
𝐃𝐚𝐲 𝟏 – 𝐒𝐡𝐢𝐯𝐚 𝐊𝐚𝐧𝐜𝐡𝐢 : 𝑴𝒐𝒓𝒏𝒊𝒏𝒈 06 𝒂𝒎 – 12 𝒑𝒎

route map : https://goo.gl/maps/mRrNgq7HhdH2

𝐊𝐚𝐧𝐜𝐡𝐢 𝐊𝐚𝐦𝐚𝐤𝐬𝐡𝐢 𝐭𝐨 𝐊𝐚𝐢𝐥𝐚𝐬𝐚𝐧𝐚𝐭𝐡𝐚𝐫 𝐓𝐞𝐦𝐩𝐥𝐞

 1. Sri Kanchi Kamakshi Ambal Devasthanam. శ్రీ కామాక్షిఆలయం, కంచి .
 2. Tirukkalwanur – తిరుక్కళ్వనూర్ (108) అమ్మవారి ఆలయం లోపల ఉంటుంది.
 3. Ulagalanda Perumal Temple – వామనమూర్తి గుడి (4 x 108 ) అమ్మవారి ఆలయం తూర్పు గోపుర వీధిలో
 4. Sri Kachabeswarar Temple – కచ్చపేశ్వర ఆలయం
 5. Kumara Kottam Subramanyar, కుమార కొష్టం – (అమ్మవారి ఆలయం వెనుక )
 6. Thiru Ekambaranathar Temple ఏకామ్రేశ్వరాలయం
 7. NilattungalTundattan – నిలాత్తుంగల్ తుండత్తాన్ (108) ఏకామ్రేశ్వరాలయం లోపల ఉంటుంది
 8. Shri Kanchi Kamakoti Peetham – కంచి కామకోటి పీఠం
 9. Pandava Dhoota Perumal Temple (108) పాండవ దూత (35 అడుగుల పెద్ద విగ్రహం )
 10. Kailasanathar Temple కైలాసనాథ ఆలయం

back to Yatri Nivas.

𝑬𝒗𝒆𝒏𝒊𝒏𝒈 4 𝒑𝒎 – 7 𝒑𝒎

route map : https://goo.gl/maps/KSC1z66MiD92

 1. TiruppulKuli – విజయ రాఘవ పెరుమాళ్- 108 (10 km. Baluchetty, Kanchi)
  జఠాయువు నకు మోక్షం ఇచ్చిన ప్రదేశం.
 2. Pachai Vannar Temple- శ్రీ పచ్చవన్నర్( మరకత వర్ణుడి సన్నిధి )
 3. Sri Pavalavannar Temple (108) శ్రీ పవళ వణ్ణమ్
 4. Vaikunta Perumal Temple (108) వైకుంఠ నాథ పెరుమాళ్
 5. Muktheesawarar Temple ముక్తీశ్వరార్ ఆలయం.

𝐃𝐚𝐲 𝟐 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐊𝐚𝐧𝐜𝐡𝐢 : 𝑴𝒐𝒓𝒏𝒊𝒏𝒈 6 𝒂𝒎 – 12 𝒑𝒎

route map: https://goo.gl/maps/vV8GkXazxC12

 1. Sri Varadaraja Perumal – పెరుమాళ్ కోయిల్ వరదరాజ స్వామి – (108)
 2. Ashtabhujuni Sannidhi -అష్టభుజము (108 Divya Desam) 1.0 km
 3. Thiru Vekka – (యధోక్తకారి ) (108) 0.5 km
 4. Tiruttanga – (దీపప్రకాశ కోయిల్) (108) 0.5 km
 5. Tiruvelukkai అళగియ సింగర్ (108) ఈ అద్భుతమైన క్షేత్రానికి అనుకూలమైన కాలం January – March తిరిగి July -December .. ఎందుకంటే ఎండాకాలం లో ఇటువంటి క్షేత్రాలు తిరగడం కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. పైన పేర్కొనబడిన ఆలయాలు అన్ని దాదాపు ఒకేచోట (5km ) ఉంటాయి. ఒక్క విజయరాఘవ పెరుమాళ్ ఆలయం మాత్రం కంచికి 10కి.మీ. దూరం లో ఉన్న Baluchetty అనే ప్రాంతం లో ఉంటుంది, దానికి డైరెక్ట్ (any point in Kanchi ) బస్సు సౌకర్యం కలదు. అన్ని ఆలయాలలో దర్శనాలు త్వరగా కావాలి అంటే వారాంతరం (weekends ) లో కాకుండా సోమవారం నుండి శుక్రవారాల మధ్యలో అయితే రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజులలో ప్లాన్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ పట్టణాల నుండి డైరెక్ట్ ట్రైన్ సౌకర్యం వున్నది, కానీ కంచికి 30కిమీ దూరం లో గల Arakkonam స్టేషన్ వరకు మాత్రమే వుంది అక్కడనుండి ప్రతి 10ని.లకు కంచికి వెళ్లే బస్సు సౌకర్యం ఉంది. మరొక ముఖ్య విషయం కాంచీపురం లో దొరికే స్పెషల్ ” కోవిల్ ఇడ్లి – Kovil Idli ” మాత్రం miss కాకండి, కేవలం బుధ, శని వారాలలో మాత్రమే అన్ని ప్రముఖ హోటల్స్ లలో దొరుకుతుంది.