హనుమంతుని విశిష్టత

By | July 30, 2021

అప్పుడు” యువరాజా! మనలో ఈ వారధిని లంఘించగల వీరుడు హనుమంతుడొకడే” అని పలికి హనుమంతునితో” హనుమా! లే. నూవు అనన్య సామాన్యుదివని గుర్తు చేస్తున్నాను. నీకంటే శక్తిమంతులు ఈ భూమండలం మీద లేరు. వెళ్ళి కార్యం సఫలం చేసుకొనిరా” అని అతని శక్తులు గుర్తుచేసాడు. హనుమంతుడు తన శక్తులు గుర్తుకు రాగా అర్ధరాత్రి ఒక్క సారి హఠాత్తుగా వెలిగిన సూర్యుడిలా ప్రకాశించాడు. తన శక్తులు గుర్తుకురాగా తోకవిదిలించి లేచాడు. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తుంటే హనుమంతుడు భీకరాకారంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఎగురులో వారధి మీదుగా లంకకు దూసుకు పోయాడు.

రామకార్యార్ధియై వెడుతున్న హనుమంతునకు విశ్రాంతినిచ్చేందుకు సముద్రుడు మైనాకపర్వతాన్ని ఆదేశించేడు. మైనాకుడు సముద్రంలోనుండి ఎదిగి హనుమదారికి అడ్డుగా నిలబడి ఆతిధ్యం స్వీకరించమని కోరగా రామకార్యార్ధిని కనుక విశ్రమించనని కృతజ్ఞతలు తెలిపి సెలవుతీసుకొన్నాడు.

హనుమంతుని శక్తిని తెలుసుకోడానికి దేవతలు సురసను పంపారు. ఆమె హనుమంతునికి అడ్డుపడి” నాకెదురైనవారు నా ఆహారమని దేవతలు చెప్పారు. నా ఉదరంలోకి రా” అని నోరుతెరిచింది. హనుమంతుడు తన శరీరం పెంచాడు. సురస కూడా శరీరం పెంచుతూ పోయింది. ఒక్క సారి హనుమంతుడు బొటన వేలంతగా మారి ఆమె ఉద్రంలోకి ప్రవేశించి గభాలున ఆమె నోరుమూసుకొనేలోగా వచ్చేసాడు. హనుమంతుని యుక్తికి మెచ్చి సురస దీవించింది.

సింహిక అనే రాక్షసి హనుమతుడు ఎగురుతుండగా నీటిపై ఉన్న అతని నీడను పట్టి ఆపింది. హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్క సారి తగ్గిచుకొని రాక్షసి కడుపు లోనికి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వచ్చాడు.

Related Images: