59th Prathishta & Vinayaka Chathurdhi 5-9-2016 Celebrations.
వినాయక చతుర్థి లోని అర్థం – పరమార్ధం రెండు విషయాలను మాతాజీ ప్రస్తావించారు. అర్ధం ఏమిటంటే భారతీయ సనాతన సంప్రదాయాలను తరువాతి తరం వారికి తెలియచేయడము, పూజలు, వేద మంత్రాల వలన ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించడము, సమాజంలో అందరు కలసి మెలసి ఉండాలని తెలియ చెప్పుటకు ఈ పండుగలు ఎంతో ఉపయోగపడుతాయి. మరి పరమార్ధం ఏమిటంటే మట్టి లో నుంచి వచ్చిన ఈ శరీరం మళ్ళీ మట్టిలోకి వెళ్లిపోవలసినదే అని తెలుసుకోవలెను. కావున అర్ధవంతమైన జీవితం గడుపుచు, కాలాన్ని, సద్వినియోగం చేసికోవాలని వివరించారు. ఆద్యన్త ప్రభువులైన వినాయక స్వామి మరియు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగినవారంతా ధన్యులని, హనుమాన్ చాలిసాను, భగవత్ గీతను ఈ గుడిలో పారాయణలుగా జరిపించవలెనని ట్రస్టీ లను మాతాజీ కోరినారు. హనుమాన్ మాతాజీ అమ్మ నాన్న ల జ్ఞాపకార్థముగా ఈ శిలాపలకముల ప్రతిష్ట వినాయక చతుర్థి పర్వదినమున జరిపించారు. జై భజరంగి బలి.
.