Sanjeevini Peetam Mathaji హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. , సాటి మరొకరు లేరు. ఆర్తులను రక్షిస్తూ, ఆంజనేయా అని తలచిన అందరినీ ప్రజ్ఞా దైర్యవంతులను చేస్తూ, తనని స్మరించినంతమాత్రమునే భూత ప్రేత పిశాచాలను దరిచేరనివ్వక అభయమొసగే ఆపద్భాందవుడు ఆంజనేయుడు. ‘దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే’. ఈ జగత్తులో కష్టమైనా పనులేమైనా ఉంటే ఆంజనేయుడి అనుగ్రహంతో అవి నెరవేరుతాయి.సేవ, భక్తి, దౌత్యం, నీతి, దైర్యం, అభయం అనే షడ్గుణములకు ప్రతీక ఆంజనేయుడు. కావున ప్రతి ఒక్కరు హనుమాన్ చాలిసాను పారాయణ చేసి తరించాలని హనుమాన్ మాతాజీ వివరించారు.