BIRTH OF BHAGAVATH GITA Margasira Suddha Ekadasi 6-12-2011. What is the Spiritual Significance of Bhagavad Gita? – Mathaji Talk

By | November 21, 2011

Mathaji Talk –Telugu 
Mathaji Talk  –  English 
Mathaji Talk  – Tamil

పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితామ్ పురాణ మునినా మధ్యే మహా భారతం
అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమ్ అష్టాదశాధ్యాయినీమ్
అంబత్వా మనుసందదామి భగవత్ గీతే భవ ద్వేషిణీం //

భగవద్గీతను ఎందుకు పఠించాలి?

2-37శ్లో॥హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః॥

” యుద్ధరంగమున మరణించినచో వీర స్వర్గమును పొందగలవు,యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు.కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము.”

ఇది అద్భుత శ్లోకాలలో ఒకటి . పరమాత్మ మనందిరిని కార్శోఖులను,కర్తవ్య పరాయణులుగాను చేయుటకై చెప్పిన శ్లోకం.

పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు.అనేకమంది పుడుతున్నారు,మరణిస్తున్నారు.ఎందుకు పుడుతున్నామో,ఎందుకు మరణిస్తున్నామో తెలియకుండా మరణించేవారే ఎక్కువ.

ఇచ్చట పరమాత్మ “కృతనిశ్చయంగా యుద్ధమునకు లెమ్ము” అన్నారు.అనగా స్ధిర సంకల్పంతో కార్యసాధనకు దిగు, అప్పుడు సాధించలేనిది ఏదీ ఉండదు.

మనిషి జీవితంలో ఏన్నో కార్యాలలో అడ్డంకులను,ఏన్నో అవమానాలను,నిందలను భరించాల్సి వస్తుంది.అన్నింటిని జయించాలి.ధర్మాచరణే ముఖ్యమని కృత నిశ్చయముతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చును.

అలా సాధించే ప్రయత్నంలో నీవు మరణించినా నీకు స్వర్గమనే కీర్తి లభిస్తుంది.ఒకవేళ విజయము పొందినచో నీకంటూ ఒక రాజ్యము ఎర్పడును,దానికి నీవే పాలకుడవు,రాజ్యభోగాలను అనుభవించగలవు.

అన్నింటికంటె ప్రధానంగా జీవిత లక్ష్యం ఏమిటి?దానిని సాధించడానికి దృడనిశ్చయం ప్రధానాంశం.నేనున్నాను నీ కర్తవ్యాన్ని చేయమని మనల్ని పరమాత్మ ఆశీర్వదిస్తున్నారు.

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు.

లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు.

గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.

గీతను మొదట ఎవరు విన్నారంటే… శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయుడు.
గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే ఒకరి సతులతో ఒకరు గీతామహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. అదికూడా సాధ్యం కానివారు కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి.

గీతాగ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమే. యజ్ఞం చెసిన ఫలం. సమస్త భూమండలాన్నీ దానం చెసినంత ఫలం. గీతాగ్రందాన్ని పూజించిన దానం చెసినా ఎన్నొ ఎంత పుణ్యం లభిస్తుందో, గీతాగ్రంథాన్ని పూజించినా, దానం చేసినా అంతే పుణ్యం లభిస్తుంది. సకల పుణ్యతీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగబాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి.

భగవద్గీత…ప్రపంచ సాహిత్యంలో దైవత్వాన్ని పొందిన తొలి ధార్మికగ్రంథం. ఐతిహాసికమైన మహాభారతంలోని భాగమైనా, ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్యఖండం. పురాణాలలో నుతింపబడ్డ ఒక ప్రబోధం. భారతజాతి సంస్కృతిని, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞానప్రవాహం.

Related Images: