హరిః ఓం, ప్రియ స్నేహితులారా, హనుమాన్ చాలీసాను 108 రాగి రేకుల మీద, 108 మంది చేత, 108 సార్లు వ్రాయించిన రేకులను, హనుమాన్ చాలీసా స్ధూపం క్రింద భద్రపరిచాను. 108 హనుమాన్ చాలీసా శిలాపలకములను, 108 పవిత్ర ప్రదేశాలలో ( దేశ విదేశాల్లో ) ప్రతిష్ట చేయుట జరిగినందుకు గుర్తుగా స్ధూపం ఆశ్రమంలో నిర్మించుట జరిగినది. ఇలా చేయుటకు ప్రేరణ నా తండ్రి ఆంజనేయుడు. నా మిగిలిన ఈ జన్మ జీవితం – స్వామి వారి కంకితం. ఇప్పటికి స్వామి ఆజ్ఞ మేరకు నా ముందున్న కార్యం : హనుమత్ పరివార సహిత నవావతార క్షేత్రం. @ అంజనాచల క్షేత్రం. కాంచీపురం.. ఈ కొండకు ఈ పేరు ఉన్నదని, ఇక్కడ ఆశ్రమం కట్టి, నేను స్థిరపడే వరకు నాకు తెలియక పోవడం కొసమెరుపు. కార్య కారణ సంబంధాలు లేకుండా ఇదంతా జరుగలేదనిపించినది. స్వస్తి. తథాస్తు. శుభం భూయాత్.
Note : అడవిలాగ ఉంది, అక్కడకు పోయి కట్టుకుంటానంటావు. ఎవరూ రాలేరు. ఏ సదుపాయాలు లేవు. అన్నారు. కానీ స్వామి వారు నన్ను రాత్రింబవళ్ళు అదే ధ్యాసలో ఉంచారు. మొండి పట్టు. బల్లి అంటే ఎలర్జీ. భయం. అలాంటిది ఈ నిర్ణయం ఏమిటో నాకూ తెలియదు. చెన్నై సిటీలో కోటి రూపాయలుకు thrible bed room house రావచ్చు. అదే డబ్బుకు, ఇక్కడ ఐతే స్వామి వారికి నా మనసులో ఉన్న స్థానం తెలియచేయవఛ్చును. Donations తో పనిలేదు. స్వతంత్రతకు భంగం కలుగదు. So. మిగతా మీకు తెలిసినదే.
అనేక హనుమత్ స్మరణలతో మీ హనుమాన్ మాతాజీ…
రామ రామ