మన ఆర్థిక పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉన్న సమయంలో కుట్రతో ఇదే అదనుగా భావించి పాకిస్థాన్ చైనా పరస్పర సహకారంతో మనపై యుద్దానికి సిద్దమైంది.. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రధాని..
కనీసం సైనికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే.. కాని యుద్ద సామాగ్రి ని కొనుగోలు చెయ్యాలి.. దేశ ప్రజల రక్షణ అన్నిటికన్నా ముఖ్యం అని భావించి లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రజల నుండి విరాళాలు సేకరించాలనుకున్నారు.. ఆయన పిలుపుతో పేద ధనిక అన్న తేడా లేకుండా తమ దగ్గరున్న కొంత డబ్బును ఇచ్చారు..
మన నటి సావిత్రి గారు ఐతే తన నగలన్ని విరాళంగా అందించారు. ప్రధాని శాస్త్రి గారు ఒక అడుగు ముందుకొచ్చి తన జీతంతో పాటు, ఒక్క పూట భోజనం మానేసి ఆ భోజన ఖర్చు కూడా విరాళం ఇచ్చారు.
అంతటి గొప్ప త్యాగంతో అలా దేశ ప్రజలందరూ ఒక్కటై యుద్ధం చేశారు.. అలా చేశారు కాబట్టే ఇప్పుడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాం..
ఇప్పుడు కూడా అవినీతి, నల్ల డబ్బు పై యుద్ధం జరుగుతుంది మనల్నేమి మన డబ్బులు అడగడం లేదు.. కేవలం మన సహకారాన్ని అడుగుతున్నారు.. కొన్ని రోజులు ఓపికగా ఉండాలి. ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి కాని కాని మన దేశం ఎదుర్కుంటున్న సమస్యల కన్నా అవి చాలా చిన్నవి. దేశం మారాలి నాయకులు మారాలి అని చెప్పడం మాత్రమే కాదు మన వంతుగా సహాయం కుడా అందించాలి..
జైహింద్.
ప్రధానమంత్రి నరేంద్రమొడి గురించి తెలియని నిజాలు కొన్ని ………
…………
సంకల్పం దృడంగా ఉంటే, ఒక సాధారణ మనిషి మహా మనిషిగా ఎదగవచ్చు అనడానికి ప్రత్యేక ఉదాహరణ ఎవరు అంటే ఖచ్చితంగా మోడీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ, చిన్న తనంలోని వాతావరణం ఎలా ఉండేదో మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో మోడీ జీవితం చాలా దుర్బరంగా గడిచింది. అయితే, అతని సంకల్పం గొప్పది కావడంతో… దేశానికీ ప్రధాని కాగలిగారు. మరో మోడీ జీవితానికి సంబంధించి కొన్ని సత్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రధాని మోడీ కవితలు రాస్తాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన గుజరాతి భాషలో అనేక కవితలు వ్రాశాడు.
2. మోడీ మంచి ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన తీసిన ఫోటోలు కొన్ని ఫోటో ఎగ్జిబిషన్ లో కూడా ప్రదర్శింపబడ్డాయి.
3. మోడీ మొదటినుంచి హిందూత్వవాది. యువకుడిగా ఉన్నప్పుడు మోడీ రెండు సంవత్సరాలపాటు హిమాలయాలకు వెళ్లి సాధువుల మధ్య జీవించాడు. అక్కడ ఉండగా హిందూ ఫిలాసఫీ గురించి మరింతగా అధ్యయనం చేశాడు.
4. 1965 లో ఇండియా పాక్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో వాలెంటీర్ గా మారి యుద్దానికి వెళ్ళే సైనికులకు రైల్వే స్టేషన్లో తన సహాయ సహకారాలు అందించాడు. మొదటి నుంచి మోడీ జాతీయవాది అని చెప్పేందుకు ఇదొక నిదర్సనం.
5. 1967 లో కరువు కాటకాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సమయంలో మోడీ అక్కడి ప్రజలకు ఆహారాన్ని సేవలను అందించాడు.
6. మోడీ అమెరికాలో మూడు నెలల పాటు పబ్లిక్ రిలేషన్స్ మరియు ఇమేజ్ మేనేజ్ మెంట్ కోర్స్ ను చేశాడు. ఆ మూడు నెలల కోర్స్ తన రాజకీయ జీవితానికి ఎంతగానో దోహదపడింది అని చెప్పొచ్చు.
7. మోడీ చిన్నతనం నుంచి వెజిటేరియన్. మద్యం, ధూమపానాన్ని దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు.
8. నరేంద్ర మోడీ కి చిన్నతనంలోనే పెళ్లి జరిగింది అనే విషయం తెలిసిందే. 13 సంవత్సరంలో మోడీకి పెళ్లి నిశ్చయించగా.. 18 వ సంవత్సరంలో పెళ్లి చేశారు. అయితే, పెళ్లి తరువాత కొన్ని రోజులు మాత్రమే కలిసున్నారు.
9. రోజులో మోడీ కేవలం 5 గంటలకు మాత్రమే నిద్రకు కేటాయిస్తారు. ఈ విషయాన్ని మోడీ అనేక సార్లు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితిలలో కూడా ఉదయం 5:30 గంటల వరకు నిద్రలేస్తారు.
10. మోడీ దేశంలోనే మోస్ట్ పాపులర్ రాజకీయ నాయకుడు అని చెప్పడానికి మరో ఉదాహరణ ట్విట్టర్. ట్విట్టర్ లో మోడీని ఆరు మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు. ఇక పేస్ బుక్ లోను ఆయన టాప్ 10 లో ఒకడిగా ఉన్నారు.
_____________________________________________________________
Our Honourable Chief Minister Selvi. J. Jaya Lalitha (24-2-1948) Valuable Images – Jai Jai Bhajaranga bali – Hanuman Mathaji.
జయలలిత జయరాం అలియాస్ పురచ్చితలైవి.. తమిళ రాజకీయాల్లో ఓ సంచలనం. అధోపాతళంలోంచి ఎగిసి.. శిఖరాగ్ర స్థాయిని అందుకుని.. పడిపోయిన కెరటం. ఆమె జీవితమంతా ఒడిదుడుకులమయం..సామాన్య కుటుంబంలో పుట్టి తమిళ రాజకీయాలను శాసించిన ధీరవనిత జయలలిత. హీరోయిన్ గా.. ఏఐఏడీఎంకే పార్టీ అధ్యక్షురాలిగా, ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా తమిళనాట జయలలిత ఓ చరిత్ర సృష్టించారు. సామాన్యులకు అమ్మలా కనిపించే జయ.. ప్రత్యర్ధులకు మాత్రం సాక్షాత్తు పురచ్చి తలైవి.. అంటే విప్లవాత్మక నాయకురాలు.
తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలుకాలోని మెల్కొటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి. జయలలిత తల్లి పాత చిత్రాలలో ప్రముఖ నటిగా పేరు పొందారు. జయరాం తాతగారు మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పని చేశారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చెన్నై కేంద్రంగా ఉన్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. ఆ సమయంలో వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది.
చిన్నప్పటి నుంచే జయలలిత ప్రజ్ఞా పాటవాలు అపారం. చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్ లో జయ ప్రాథమిక విద్యను అభ్యసించింది. చదువులో జయలలిత ప్రతిభాపాటవాలను గుర్తించిన ప్రభుత్వం ఆమెకు స్కాలర్ షిప్ మంజూరుచేసింది. అయితే కుటుంబ పరిస్థితుల వలన జయ 15 వ ఏటనే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. తన తల్లి నటిస్తున్న చిత్రాలలో కూడా నటిస్తుండేంది. అయితే తన చదువుకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా దర్శకుల వద్ద ముందస్తుగా అనుమతి తీసుకునేది.
సినిమా ఇండస్ట్రీలో జయలలిత ఎన్నో విజయాలు సాధించారు. జయ నటించిన ఈపిస్ట్లీ అనే ఇంగ్లీషు చిత్రం 1961లో విడుదలైంది. జయ హీరోయిన్ గా కన్నడంలో మొట్టమొదట నటించిన చిత్రం చిన్నదా గంబి. 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. తెలుగులో వచ్చిన మనషులు మమతలు మూవీ జయకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 140 చిత్రాలలో నటించారు. ఆమె జాతీయ అవార్డ్ తోపాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయను కళైమామణి అవార్డుతో సత్కరించింది.
తమిళ రాజకీయాల్లో జయలలిత తనదైన ముద్ర వేశారు. జయ రాజకీయ ప్రవేశం విచిత్రంగా జరిగింది. 1977లో ఎంజీ రామ్ చంద్రన్ తమిళనాడు మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచ్చెందూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఏఐఏడీఎంకే తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు. పెద్దలసభలో ఏఐఏడీఎంకేకి ఓ విధమైన గుర్తింపు తీసుకువచ్చారు.
1987లో రామచంద్రన్ మరణించటంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. మెజార్టీ నాయకులు జానకీ రామచంద్రన్ కు మద్దతు ప్రకటించటంతో .. ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.
1989లో బొడినాయక్కనూర్ నుంచి ఏఐఏడీఎంకే తరపున శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. సభలో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు.
1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జయ పార్టీ 225 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో ఆమె ఆదాయానికి మించిని ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ కేవలం నాలుగు సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఓటమికి వెరవని జయలలిత..2001 ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలు గుప్పుమనటంతో జయలలిత పదవి నుంచి తప్పుకున్నారు. మంత్రివర్గంలోని పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే 2006లో జరిగిన ఎన్నికల్లో జయ పార్టీ పరాజయం పాలైంది. మళ్లీ 2011లో ముచ్చటగా మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల కోసం ‘అమ్మ’ పేరిట పలు సంక్షేమ పథకాలు అమలుచేశారు. సీఎంగా అమలుచేసిన సంక్షేమ పథకాలు జయలలితకు సామన్య జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టాయి.
అవినీతి ఆరోపణలు జయలలిత రాజకీయ జీవితాన్ని వెంటాడాయి. తమిళ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న తరుణంలోనే బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా నిర్థారించింది. కోర్టు తీర్పు జయలలిత రాజకీయా జీవితాన్నే కాదు ఏకంగా తమిళ రాజకీయాలనే ఓ కుదుపు కుదిపేశాయి.