“Sri Rama Namam” Bhajan song – without any instruments but I don’t have any music knowledge, Excuse me – Hanuman Mathaji
రామదాసు కీర్తన – శ్రీ రామ భజన
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం
విష్ణుకథలు చెవులు విందాం విందాం
వేరేకథలు చెవుల మందాం మందాం
రామదాసులు మాకు సారం సారం
రామ ద్రోహులు మాకు దూరం దూరం
నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులనిక మేము నమ్మాం నమ్మాం
మాధవ నామం మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం
అవనీజ పతిసేవ మానాం మానాం
మరియొక జోలంటే మౌనాం మౌనాం
భద్ర గిరీశుని కందాం కందాం
భద్రములో మనముందాం ఉందాం // శ్రీరామ //
——————————————————————-
శ్రీ రామ చంద్రుని – మంగళ హారతి …
పల్లవి
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
చరణములు
1.కోసలేన్ద్రాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్విరాయ మంగళం
2. లలితరత్న కుండలాయ తులసి వనమాలికాయ
జలద సదృశ దేహాయ చారు మంగళం
3.దేవకీ సుపుత్రాయ దేవ దేవోత్తమాయ
భావజా గురు వరాయ భవ్య మంగళం
4. చారుమేఘ రూపాయ చందనాదిచర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
5. విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుమహ చిత కామితాయ శుభ మంగళం
6.పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజ వాహనాయ అతుల మంగళం
7.రామదాస మృదు హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం