మాతాజీ కి 55 ప్రతిష్ట లో భాగంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. 55 వ శిలా పలకములను అత్యంత వైభవముగా ప్రారంభించినారు. అందరూ భక్తి శ్రద్ధలతో మాతాజీతో కలసి హనుమాన్ చాలీసా పారాయణ చేసినారు. ప్రతి ఒక్కరు నియమ నిష్టలు పాటించనవసరము లేకుండా, కొంగు బంగారం లాంటి చాలిసాను నిత్య పారాయణము చేయవలసినదిగా అందరిని కోరినారు. ఆంజనేయుడు పిలిస్తే పలికే దైవం , రామచంద్రుని ఆజ్ఞమేరకు కలియుగం అంతం వరకు భూభారాన్ని మోస్తూ భూమిపైనే నివసించియున్న భక్త సులభుడు శ్రీ ఆంజనేయుడు అని మాతాజీ చెప్పారు. భగవంతుడే పలికినందువలన భగవత్ గీత, భగవంతుడే వినినందువలన శ్రీ విష్ణు సహస్రనామము ఎంత శక్తివంతమైనవో అలాగే సాక్షాత్తు హనుమంతుడి విని ఆశీర్వదించినందువలన తులసీదాస్ గారి శ్రీ హనుమాన్ చాలీసా అత్యంత శక్తివంతమైనదని మాతాజీ వివరించారు. ఇటువంటి హనుమాన్ చాలీసాను మనమంతా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరినారు. భారత దేశ గౌరవ ప్రతిష్టలు భావి భారత పౌరుల మీద ఉన్నందున , వారంతా హనుమంతుని కృపతో గొప్పవారై , దేశాన్ని ముందుకు నడిపించాలని, అందుకు హనుమాన్ చాలీసా ఉపయోగ పడుతుందని అభిప్రాయపడినారు. కలియుగ మానవులు తరించుటకు హనుమత్ సేవకు మించినది లేదన్నారు. జై భజరంగ బలి , జై జై శ్రీ రామ్