1)
“చల్లని రాజా ఓ చందమామ” మాదిరి.
ఎందులకోయీ తాపత్రయంబు
జీవులకయ్యొ తెలియదు ఈ లోకమంతా
ఈ మాయనిండె // ఎందు //
పరమార్ధము మదిలోన
పరమాత్ముని దర్శింప యత్నింపరు
ఇది నాదే యని, నాకు నేనే యని
ఈ ఆశల పాశాల మెడ జుట్టుకొందురు // ఎందు //
ఈ మాయాల తెరకవుల ఏమున్నదో
మోహబంధాల ద్రుంచేది ఏ ఖడ్గమో
నాకు చూపించవా, నన్ను కరుణించవా
ఓ ఘటికాచల వాసా, ఓ ఆంజనేయ // ఎందు //
మము శిక్షింప రక్షింప దక్షడవు
వల పక్షము జూపని మా తండ్రివి
దీన రక్షా, రామ భక్త, చింతామణి
నే దీనుడ, బ్రోవర, మోక్ష ప్రదాత // ఎందు //
———————————–