Bhagavath Geetha Cultural Hall – Boomi Pooja Ceremony
@ Anjanamma Land, Dusi. 2-10-2016..Muhurtham 2. 21 pm
భగవద్తీత ఉపోధ్ఘాతము
అందుకే భగవద్గీత మనకేం చెబుతోంది? అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ వ్యాస పరంపర. భగవద్గీత అనాదిగా మనకు పారాయణ గ్రంథంగా వస్తున్నది. పరమంటే శ్రేష్టమైన, ఆయనం అంటే మార్గం. అంటే శ్రేష్టమైన మార్గం అనే భావనే పారాయణం. జీవితానికి సంబంధించిన గ్రంథం కనుక భగవద్గీతను మన పూర్వీకులు రోజూ పారాయణం చేసేవారు.
వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతంలోని భీష్మపర్వంలో భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కృష్ణుడికి, అర్జునుడికి మధ్య సంభాషణ రూపంలో భగవద్గీత కనిపిస్తుంది. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ధర్మశాస్త్ర నిపుణులే. అకస్మాత్తుగా అర్జునుడిలో తన ధర్మాన్ని గురించిన సందేహం మొలకెత్తింది. దానికి సమాధానం ఇవ్వడమే శ్రీకృష్ణుడు చేసిన పని. భగవద్గీతలో కృష్ణుడు హింసను ప్రేరేపించాడని, అర్జునుడిని యుద్ధానికి పురిగొల్పాడనీ అనడం సరైనది కాదు. గీతాభాష్యంలో శంకరులు స్పష్టంగా “’న చ అత్ర యుద్ధ కర్తవ్యతా విధీయతే’ అని రాశారు. అంటే ఇక్కడ యుద్ధం చేయమని పురిగొల్పడం లేదు. స్వధ ర్మాన్ని మరచి పరధర్మమైన భిక్షాటనాన్ని తీసుకుంటాననడం (భిక్షాటనమనేది బ్రాహ్మణుడి ధర్మం) తప్పు అని కృష్ణుడి భావమని శంకరులు వివరించారు. మంచికీ చెడుకూ మధ్య జరుగుతున్న సంఘర్షణ భారతయుద్ధం. అందులో ధర్మాన్ని నిలబెట్టడం క్షత్రి యుడి కర్తవ్యం. అందువల్లనే ఈ ఉపదేశం. భగవద్గీత కేవలం బుద్ధితో అర్థం చేసుకుని దానితో ఆగిపోయే గ్రంథం కాదు. ఇది సాధనకు సంబంధించిన విషయం. ఇందులో చెప్పిన సాధనలు సాధకుడు స్వయంగా అభ్యాసం చేసి తనలో మార్పు తెచ్చుకోవడానికై ఉద్దేశించిన గ్రంథం. ఇతరులను కాదు, తనను తాను మార్చు కోవడానికి ఉద్దేశించినది.
అందుకే భగవద్గీత మనకేం చెబుతోంది? అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ వ్యాస పరంపర.
——————————-
అర్జున విషాదయోగం
అర్జునుడి విషాదాన్ని తెలుపుతుంది కాబట్టి ఈ అధ్యాయానికి అర్జున విషాదయోగం అని పేరు. ఈ అధ్యయాల పేర్లు వ్యాస భారంతో లేవు. తర్వాతి వ్యాఖ్యాతలు అధ్యాయంలోని విషయాన్ని పాఠకులకు సులభంగా తెలపడానికి పెట్టినపేర్లు.
ఈ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. అర్జునుడి విషాదానికి కారణం మనకు తెలిసిందే. కౌరవులు – పాండవులు అన్నదమ్ముల
పుత్రులు. పాండవులకు రావలసిన రాజ్యం వారికివ్వకుండా
అడ్డుకున్నాడు కౌర యువరాజు దుర్యోధనుడు. రాజ్యమివ్వడానికి శ్రీకృష్ణుడు చేసిన రాయబారము నిరుపయోగ మైంది. అందువల్ల రెండు పక్షాల వారు వారివారి మిత్రరాజుల సహకా రంతో సైన్యాన్ని ప్రోగు చేసుకున్నారు. అర్జునుడు, దుర్యోధనుడు స్వయంగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి యుద్ధంలో అతని సహాయాన్ని కోరడంతో శ్రీకృష్ణుడు తన సైన్యమంతా ఒకవైపు, యుద్ధం చేయకుండా ఊరక సలహా ఇచ్చు తాను మరొకవైపు అని విభజించి చెప్పాడు. దుర్యోధనుడు సంతోషంగా సైన్యాన్ని కోరుకుంటే అర్జు నుడు సంతోషంగా శ్రీకృష్ణుడిని కోరి తెచ్చుకున్నాడు. ఒకానొక నిర్ణీత సమయంలో యుద్ధానికి రెండు సేనలూ సర్వసన్నాహాలు చేసుకు న్నాయి. యుద్ధస్థలం పేరు కురుక్షేత్రం.
పదిరోజుల భారతయుద్ధం తర్వాత భీష్ముడు అంపశయ్యపై వాలగా ఆ సమాచారాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అతణ్ణి పూర్తి వివరాలడుగుతాడు. ప్రారంభంనుండి జరిగిన విషయాలన్నీ సంజయుడు చెప్పడం ప్రారంభిస్తాడు. వ్యాస మహర్షి వరం వల్ల సంజయుడికి దివ్యదృష్టి కలగడంతో సంజయుడు పూసగుచ్చినట్లుగా యుద్ధభూమిలోని విషయాలను తన జ్ఞాననేత్రంతో దర్శించి తెలియజేయడం గీతా సన్నివేశం.
మన బుద్ధియే కురుక్షేత్రం
ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకంలో ధృతరాష్ట్రుడి ప్రశ్నతో గీత ప్రథమాధ్యాయం ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రమైన కురు క్షేత్రంలో నావారూ, పాండవులు ఏమి చేశారని ప్రశ్న. నా వారు అన్న మాటతోనే పాండవులు నా వారు కారని చెప్పకనే చెప్పాడు ధృత రాష్ట్రుడు. కౌరవవంశ మూలపురుషుడైన కురు మహారాజు అనేక ధర్మకార్యాలు చేసిన పుణ్యస్థలం కురుక్షేత్రం. అక్కడ ధర్మానికే విజయం అనే మాట ధ్వనిస్తుంది. సంస్కృతంలో కృఞ్ అనే ధాతువుకి కర్మ చేయడమని అర్థం. కురు శబ్దం దీనినుంచి వచ్చినదే. కర్మకు క్షేత్రం శరీరమే. శరీరంలోని జీవుడు కర్మను ఆచరించేవాడు. మనస్సనేదే పగ్గం. బుద్ధి సారథి. జీవుణ్ణి బాహ్యవస్తువులవైపు పరుగులెత్తించే ఇంద్రియాలే గుఱ్ఱాలు. ఈ కల్పన మనం తెచ్చిపెట్టుకున్నది కాదు. కఠోపనిషత్తులో ఈ విషయం ఇంకా చక్కగా చెప్పబడింది.
ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవతు|
బుద్ధింతు సారథి విద్ధి మన: ప్రగ్రహమేవ చ|| (కఠోపనిషత్)
శరీరమే రథం. అందులో ఉండే రథస్వామి లేదా యజమాని జీవుడు. అతణ్ణి నడిపించే బుద్ధి సారధి. మనస్సే ప్రగ్రహం. అంటే పగ్గం. కన్ను, ముక్కు, చెవి మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలే గుఱ్ఱాలు. ఇవి తాము గ్రహించే విషయాలవైపు మనిషిని లాగుతుంటాయి. వాటిని అదుపులో పెట్టాల్సింది మనస్సు. విజ్ఞానవంతమైన బుద్ధి రథికుణ్ణి అతని గమ్యానికి చేరుస్తుంది. దీనినే మరోమంత్రంలో వివరిస్తూ అలాంటి విజ్ఞానసార్థి గల రథస్వామి పరమపదం అంటే పరమాత్మ తత్త్వాన్ని పొందుతాడని చెబుతుంది ఉపనిషత్తు.
శ్రీకృష్ణుడికి నారాయణుడనీ, అర్జునుడికి నరుడనీ కూడా పేర్లున్నాయి. నరుడంటే జీవుడు. నారాయణుడు నరాణాం ఆయనం అంటే నరులకు గమ్యస్థానం. అదే జీవులు సాధించవలసిన మోక్షావస్థ. ఆత్మను తెలుసుకోవడమే మోక్షం. అది ఎక్కడో ఆకాశంలో పొందవలసిన స్థలం కాదు. ప్రతి వ్యక్తీ తన అంత:కరణను విశ్లేషించి తన కోరికలు రాగద్వేషాలు మొదలైన వాటిని పరిశీలించి ఈ మనస్సును, బుద్ధి ప్రవృత్తుల్నీ ప్రేరేపిస్తున్న చైతన్య శక్తి ఏమిటి? అని పరిశీలించడం, అంటే ఆత్మవిచారం చేయడం ముఖ్యం. గాయత్రీ మంత్రంలో ధియో యో న: ప్రచోదయాత్ అంటారు. అంటే మన బుద్ధి వృత్తుల్ని అంటే బుద్ధిలో మెదిలే ఆలోచనలను ప్రేరేపిస్తున్న చైతన్యశక్తి ఏదో అదే తన స్వరూపమని తెలుసుకొని రాగద్వేషాలకు అతీతుడిగా ఉండటమే మోక్షం.
ఈ జ్ఞానంలోనే నిలిచివుండి ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండే స్థితి సంన్యాసం. దీనిలో వ్యక్తి తనకున్న సమాజ బాధ్యతలనుండి పూర్తిగా తొలగిపోయి కేవలం బ్రహ్మజ్ఞానంలో నిలిచి ఉంటాడు. అలాంటివాడిని బ్రహ్మనిష్టుడు అంటారు. అంటే ఏవిధంగా ఎలాంటి సంగము లేకుండా జ్ఞానస్వరూపం వుంటుందో అలాంటి జ్ఞాన స్వరూపంలో బ్రహ్మగా ఉంటాడు అని అర్థం.
ఈ స్థితి సమాజంలో అందరికీ అనవసరం. సాధకులందరికీ లభించదు. ఈ జ్ఞానం స్వరూపాన్ని సైద్ధాంతికంగా తెలుసుకుని సమా జం తనకప్పగించిన బాధ్యత లను రాగద్వేషాలు లేకుండా నిర్వ హించ డం రెండవ స్థితి. అంటే కర్మ చేస్తూ ఉండటం. దీనినే కర్మ యోగం అంటారు. దీని గురించి 2, 3, 4, 5 అధ్యాయాల్లో వివరంగా తెలు స్తుంది. భారతంలో అర్జును డికి జ్ఞాన
స్వరూపాన్ని పూర్తిగా వివరి స్తాడు శ్రీకృష్ణుడు. కానీ అతను సంన్య సించాలనే ఉద్దె శంతో కాదు. తత్వ్తాన్ని సరిగా తెలుసు కొని తన కర్తవ్యాన్ని మరింత శ్రద్ధతో నిర్వ హించాలనే ఉద్దేశం. మనందరం అర్జునుడి స్థానంలో ఉన్నవాళ్లం. మనందరికీ ఉపదేశం.
————————————-
|” భగవద్గీతను ఎందుకు చదవాలి…..? ”||
1. గీతోచ్చారణ వలస నత్తివంటి దోషాలు తొలగునని
శాస్త్రీయముగా నిరూపించబడినది.
2. గీతాశ్లోక పఠనం వలస ఉచ్చారణ శక్తి మరియు
ధారణశక్తి , ఏకాగ్రత లభించును.
3. భయం ,ఆందోళన మరియు ఒత్తిడి , కోపం ,బద్దకం తొలగును
పెద్దలపట్ల గౌరవం మంచి ఆలోచనలు వృద్ధి చెందును.
4. స్వర్ణ పేటిక , శ్వాసకోస వ్యవస్థ మెరుగుపడి
మంచి ఆరోగ్యం లభించును.
5. వారిపట్ల వారికి నమ్మకం పెరిగి జీవితంలో
పురోభివృద్ధి సాధించెదరు.
6. ఈ పఠన పోటీల ప్రభావము వల్ల మీ చిన్నారులకు
ఉత్తమ సంస్కారము అలవడుటయే కాక వారి భవిష్యత్తుకు
మంచి మార్గదర్శకం కాగలదు.
—————————————-
HISTORICAL TRUTH:*GEETHA:5137Years
*THIPEETIKAS:4014Years
*BIBLE:2017Years
*QUARAN:1417Years
Before 2017years ago No Bible,
No Quran only BHAGAVATHGEETHA
in INDIAN Terrotary
————————————————-
భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా. బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు . అతను విద్యార్థి గా ఉన్న రోజులలో . ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు. ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.
ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు. అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత బాషలో చెప్తున్నాను “లోపలకు రండి” అని అన్నారు. “మీకు సంస్కృతం రాదా, పోనిలే లోపలి రండి!” అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టేరు.
“హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చేరు. మీదేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలో వుంది. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి” అన్నారు ఐన్ స్టీన్.
ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి, “ఇది తెలుసా మీకు?” అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త “విన్నానండీ” అని సమాదానమిచాడు.
“ఓహ్, విన్నారా ..” అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు ఐన్ స్టీన్ ని ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతరిక దృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను” ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఏమన్నారంటే!
మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు.అన్నారట.
భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో అదేం విచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే. దాని గొప్ప దనాన్ని గుర్తుపట్టడం లేదు.