57th HANUMAN CHALISA PRATHISHTA 30-7-2016. 108 హనుమాన్ చాలీసా శిలాపలకముల ప్రతిష్ట – మాతాజీ సంకల్పము – హనుమాన్ ప్రేరణ

By | July 28, 2016

Mambalam Talk 30-7-2016

talk-30-7-201657

57 th Prathishta @ Royapuram – 30-7-2016

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ !

తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్ !!

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది అని హనుమాన్ మాతాజీ వివరించారు. భక్తితో 5 తమలపాకులు సమర్పించిన చాలును స్వామివారు అనుగ్రహిస్తారని తెలిపినారు.

లేత తమల పాకుల హారాన్ని వేయిస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది. మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.
సంసారంలో సుఖం లబిస్తుంది.
స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.
వ్యాపారం సమయంలో నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకుల తో పూజ చేస్తే వ్యాపారం భాగుపడుతుంది. శనైశ్చర దృష్టి ఉన్నవారు వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.

కావున అందరు స్వామివారిని ప్రార్ధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని మాతాజీ ఆశించారు. ఈ దేవాలయంలో భగవత్ గీత నిత్య పారాయణలు జరిగేలాగా చూడాలని పూజారిని, ధర్మ కర్తలను అభ్యర్ధించారు. అలాగే శిలాపలకముల దాతలు టంగుటూరి. సీతారాం గారికి హనుమాన్ మాతాజీ కృతజ్ఞతలు తెలియ చేసినారు.

The Largest Circulated Sakshi Telugu Daily News Paper 31-7-2016


sakshi-31-7-2016