-
My Guru Bhagavath Geetha – Hanuman Mathaji
- పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితామ్ పురాణ మునినా మధ్యే మహా భారతం
అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమ్ అష్టాదశాధ్యాయినీమ్
అంబత్వా మనుసందదామి భగవత్ గీతే భవ ద్వేషిణీం // -
1) మొదటి అధ్యాయం, అర్జునవిషాదయోగం-Bhagavath Geetha 1st Chapter
-
2) రెండవ అధ్యాయం – సాంఖ్యయోగం Second Chapter
-
3) మూడవ అధ్యాయం – కర్మయోగం Third chapter
-
4) నాల్గవ అధ్యాయం – జ్ఞానయోగం Fourth Chapter
-
5) ఐదవ అధ్యాయం – కర్మసన్యాసయోగం fifth chapter
-
6) ఆరవ అధ్యాయం – ఆత్మసంయమయోగం sixth chapter
-
7) ఏడవ అధ్యాయం విజ్ఞానయోగం seventh chapter
-
8) ఎనిమిదవ అధ్యాయం – అక్షరపరబ్రహ్మయోగం – Eight chapter
-
9) తొమ్మిదవ అధ్యాయం – రాజవిద్యారాజగుహ్యయోగం – Nineth Chapter
-
10) పదవ అధ్యాయం – విభూతియోగం 10th chapter – Bhagavath Geetha
-
11) పదకొండవ అధ్యాయం, విశ్వరూపసందర్శనయోగం- Bhagavath Geetha 11th Chapter
-
12) పన్నెండవ అధ్యాయం – భక్తియోగం 12 th capter
-
13) పదమూడవ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం – Bhagavath Geetha 13th Chapter
-
14) పదునాల్గవ అధ్యాయం, గుణత్రయవిభాగయోగం – Bhagavath Geetha 14th Chapter
-
15) పదునైదవ అధ్యాయము – పురుషోత్తమప్రాప్తియోగము 15 th chapter
-
16) పదునారవ అధ్యాయము – దైవాసురసంపద్విభాగయోగము 16 th Chapter
-
17) పదునేడవ అధ్యాయము – శ్రద్ధాత్రయ విభాగయోగము 17 th chapter
-
18) పదునెనిమిదవ అధ్యాయము – మోక్షసన్న్యాసయోగం Eighteenth Chapter
జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
“కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. చిన్నవయసులోనే అది జరగాలి”
* ‘భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.
* సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.
* సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.
* ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.
* ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్ చేసే మేజిక్. మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.