Yuga sahasra yojan par Bhanu
Leelyo thahi madhur phal janu
Chalisa loni Prathi Doha Ardhavanthamainade — Mathaji
Every couplet(Doha) in Hanuman Chalisa depicts the noteworthy information which man today researches and confirms in Science and Technology. – Mathaji talks
భూమి – సూర్యుడి మధ్య దూరం హనుమాన్ చాలీసా లో ఎలా రాసారు?
15వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసా ను రచించాడు. ఇందులో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది. 17వ శాతంబ్దంలో 1672 సంవత్సరంలో జీన్ రిచెర్ మరియు జియోవన్ని డోమేనికో కాస్సిని అనే వారు భూమి యొక్క వ్యాసార్థంను (రేడియస్) 22,000 సార్లు కలిపితే భూమి నుండి సూర్యుడి దూరం అంతా అని దృవీకరించారు. భూమి యొక్క వ్యాసార్థం 6,371 కీ.మీ. అంటే 22000 x 6371 = 140,162,000 కీ.మీ. (140 మిలియన్ కీ.మీ.) అని శాత్రవేత్తలు చెప్పారు. కానీ అది కేవలం అంచనా అని తేలిపోయింది.
ఇదే విషయాన్ని హనుమాన్ చాలీసా లో కేవలం మూడు ముక్కలలో మరింత స్పష్టంగా తెలియజేసారు. తులసీదాస్ హనుమాన్ చాలీసా లో రచించినట్టు….. యుగ సహస్ర యోజన పరభానూ, లీల్యోతాహి మధుర ఫలజానూ….. అనే దానిలో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది.
యుగ అంటే = 12000
సహస్ర అంటే = 1000
యోజన అంటే = 8
12000 x 1000 x 8 = 96,000,000 మైళ్ళు
1 మైలు = 1.6 కీ.మీ.
96,000,000 x 1.6 కీ.మీ. = 153,600,000 (15 కోట్ల 36 లక్షల కీ.మీ.)
ప్రస్తుతం భూమి నుండి సూర్యుడి వరకు ఉన్న దూరం = 149,600,000
శాస్త్రవేత్తల కన్నా రెండు శతాబ్దాల ముందే… 15వ శతాబ్దంలో తులసీదాస్ ఈ లెక్కను ఇంత దెగ్గరగా ఎలా చెప్పాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం… హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు, సూర్యుడిని పండు అనుకోని మింగేస్తాడు…. అప్పుడే భూమి నుండి సూర్యుని వరకు ఎంత దూరముందో తెలుసుకున్నారని అంటారు. హనుమాన్ చాలీసా లో రచించిన దూరంతో అమెరికా లోని నాసా సంస్థ వారు కూడా ఏకీభవించారు.