వ్యక్తిత్వ వికాసం. భగవద్గీత (Bhagavath Geetha)

By | August 25, 2020

Krishna Jayanthi Celebrations 25-8-2016 @ Sanjeevini Peetam.

Hanuman Mathaji Talk.
సంజీవిని పీఠంలో కృష్ణాష్టమి వేడుకలు – తులసి దళాలతో అష్టోతర, సహస్రనామార్చనలు, కృష్ణ పరమాత్మకు పాలాభిషేకం, గీత పారాయణ, భజనలు మాతాజీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగినవి.

ఈ ధరిత్రి పైన అసాధారణ జన్మమెత్తిన శ్రీ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగాంతం లో మానవాళికి అందించిన మకరందమే కలియుగ మానవులకు దివ్య ఔషధం. కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞాన యోగాల పేరుతో సమస్త జీవరాశులకు శ్రీ కృష్ణ పరమాత్మ అలౌకిక దివ్యానుభూతితో కూడిన అమృతాన్ని అందించిన పురుషోత్తముని అవతార వేడుకలను మనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. శ్రీ కృష్ణ పరమాత్మ యోగయుక్తుడై, మానవాళికి మహోపకారం చేసి ధర్మ స్థాపన చేసినారు. ఆ ధర్మాన్ని ఈ కాలానుగుణంగా ఆచరించినచో మనం జీవించే ముక్తులవుతాము. అంటే ఆనందముగా కలకాలం జీవించుతామని అర్ధం. ఉపనిషత్తు, బ్రహ్మవిద్య , యోగశాస్త్రం యొక్క సారమైన భగవత్ గీత, శ్రీ కృష్ణ భగవానుని నోటివెంట జాలువారినది. అటువంటి గీత పారాయణలు ప్రపంచ నలుమూలల జరుపుకోవడం చాల సంతోషంగా ఉన్నది. తొందరలోనే పాఠ్య పుష్టకాలలో భగవత్ గీతను చేర్చి, చిన్న వయసులోనే పిల్లలలో వ్యక్తిత్వ వికాసానికి, సనాతన ధర్మానికి పునాదులు వేస్తారని ఆశిస్తున్నాను అంటూ హనుమాన్ మాతాజీ వివరించారు.