Author Archives: hanuma

పదునెనిమిదవ అధ్యాయము – మోక్షసన్న్యాసయోగం Eighteenth Chapter

శ్రీమద్భగవద్గీత పదునెనిమిదవ అధ్యాయము – మోక్షసన్న్యాసయోగం అర్జున ఉవాచ సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ | త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన || 1 అర్జునుడు: కృష్ణా! సన్యాసం, త్యాగం—వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః | సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః || 2 శ్రీ భగవానుడు: ఫలాన్ని ఆశించి చేసేకర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదలిపెట్టడమే త్యాగమని కొందరి… Read More »

రెండవ అధ్యాయం – సాంఖ్యయోగం Second Chapter

శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సంజయ ఉవాచ: తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ | విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః || 1 శ్రీ భగవానువాచ: కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ | అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున || 2 క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే | క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప || 3 సంజయుడు: దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా శ్రీ కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు. అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధమూ, అపకీర్తి దాయకమూ, నరకప్రాప్తి… Read More »

మూడవ అధ్యాయం – కర్మయోగం Third chapter

శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం అర్జున ఉవాచ: జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన | తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 1 అర్జునుడు: జనార్దనా ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా ? అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్ధ కర్మకు నన్నెందుకు పురికొల్పుతున్నావు ? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే | తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో௨హమాప్నుయామ్ || 2 అటూయిటూ కాని మాటలతో నా మనసుకు… Read More »

నాల్గవ అధ్యాయం – జ్ఞానయోగం Fourth Chapter

శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయం జ్ఞానయోగం శ్రీ భగవానువాచ: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ | వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే௨బ్రవీత్ || 1 శ్రీ భగవానుడు: వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికీ బోధించారు. ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః | స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప || 2 అర్జునా! ఇలా సంప్రదాయ పరంపరగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది… Read More »

ఐదవ అధ్యాయం – కర్మసన్యాసయోగం fifth chapter

శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మసన్యాసయోగం అర్జున ఉవాచ: సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి | యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ || 1 అర్జునుడు: కృష్ణా! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరోసారి కర్మయోగం ఆచరించమనీ ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు. శ్రీ భగవానువాచ: సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ | తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే || 2 శ్రీ భగవానుడు! కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం… Read More »

ఆరవ అధ్యాయం – ఆత్మసంయమయోగం sixth chapter

శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మసంయమయోగం శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః | స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః || 1 శ్రీ భగవానుడు: కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతేకానీ అగ్నిహోత్రాది కర్మలు మానివేసినంతమాత్రాన కాడు. యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ | న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన || 2 పాండునందనా ! సన్యాసమూ,… Read More »

ఏడవ అధ్యాయం విజ్ఞానయోగం seventh chapter

శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయం విజ్ఞానయోగం శ్రీ భగవానువాచ: మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః | అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు || 1 శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా, సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. జ్ఞానం తే௨హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః | యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే || 2 బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు (స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను.… Read More »

ఎనిమిదవ అధ్యాయం – అక్షరపరబ్రహ్మయోగం – Eight chapter

శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం – అక్షరపరబ్రహ్మయోగం అర్జున ఉవాచ: కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ | అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 1 అర్జునుడు: పురుషోత్తమా ! బ్రహ్మమంటే ఏమిటి? అధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి? అధియజ్ఞః కథం కో௨త్ర దేహే௨స్మిన్ మధుసూదన | ప్రయాణకాలే చ కథం జ్ఞేయో௨సి నియతాత్మభిః || 2 మధుసూదనా ! ఈ శరీరంలో అధియజ్ఞుడెవడు; ఎలావుంటాడు? మనో నిగ్రహం… Read More »

తొమ్మిదవ అధ్యాయం – రాజవిద్యారాజగుహ్యయోగం – Nineth Chapter

శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యారాజగుహ్యయోగం శ్రీ భగవానువాచ: ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే | జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || 1 శ్రీ భగవానుడు: అశుభకరమైన సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతిరహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని అసూయలేని నీకు ఉపదేశిస్తున్నాను. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2 విద్యలలో ఉత్తమం, పరమరహస్యం, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవంవల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం… Read More »

పదవ అధ్యాయం – విభూతియోగం 10 th chapter Bhagavath Geetha

శ్రీమద్భగవద్గీత పదవ అధ్యాయం – విభూతియోగం శ్రీ భగవానువాచ: భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః | యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 1 శ్రీభగవానుడు: నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సుకోరి శ్రేష్ఠమైన వాక్యం మళ్ళీ చెబుతున్నాను విను. న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః | అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 2. దేవగణాలకుకాని, మహాఋషులకుకాని నా పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. దేవతలకూ, మహర్షులకూ… Read More »